భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా యువ నాయకులు విడదల గోపినాధ్ ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేట పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రాజ్యాంగ నిర్మాత డా. బీ. ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నరసరావుపేట సెంటర్లోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.