వైసీపీ పార్టీ నేతలు చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మిగిలిన కులాలతోపాటు ధైర్యంగా బతకాలని ఆలోచించిన సీఎం జగన్. చంద్రబాబు ప్రభుత్వంలో పేదలపై, ఎస్సీలపై దాడులు జరిగాయి. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న నీచ సంస్కృతి, బీసీలు జడ్జిలుగా పనికిరారన్న వ్యక్తి చంద్రబాబు. కానీ నేడు రాష్ట్రంలో పేదల స్థితిగతులు మారాయి. పేదలు గుండెమీద చేయి వేసుకొని ధైర్యంగా బతుకుతున్నారు. ఆశ్రిత పక్షపాతం లేకుండా సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కమ్మని పాలన అందుతోంది. ఏ ఇంటి తలుపుతట్టినా జగనన్న మాకు మేలు చేశారనే పరిస్థితి కనిపిస్తోంది. 640 వాగ్దానాలిచ్చి ఒక్కటీ నెరవేర్చని టీడీపీ. మళ్లీ పవన్‌తో కలిసి మోసం చేయాలని వస్తున్న చంద్రబాబు. రాష్ట్రంలో పేదల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవాలని కోట్లు ఖర్చుపెట్టిన జగనన్న. కార్పొరేట్ వైద్యం చేయించుకొని ఇంటికొచ్చిన తర్వాత కూడా డబ్బులిస్తున్న జగనన్న. 31 లక్షల ఇళ్ల పట్టాలిస్తే అగ్ర తాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. రూ.2.40 లక్షల కోట్లు పేదవారికి ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 80 శాతం అందాయి. చంద్రబాబు ఐదేళ్లలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టలేకపోయాడు. నేడు విజయవాడ నడిబొడ్డున కోట్ల ఖరీదు చేసే అంబేద్కర్ విగ్రహం పెడుతున్న సీఎం జగన్. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా జగనన్నను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.