పవన్ కల్యాణ్...నువ్వు రాజకీయ విటుడివా..? బ్రోకర్‌వా..? అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....... పవన్ కల్యాణ్..నీకు ఈ రాష్ట్రానికి ఏమిటయ్యా సంబంధం? ఈ రాష్ట్రంలో నువ్వు ఉండవు..ఈ రాష్ట్రంలో నీకు సొంత ఊరే లేదు. కాసేపు బాపట్ల అంటావ్..కాసేపు చీరాల అంటావ్...కాసేపు గుంటూరు అంటావ్ కనీసం సొంత ఇళ్లు కూడా లేదు...ఓటుందా అంటే ఓటు కూడా లేదు. అసలు నీ భార్యలు పిల్లలు ఎక్కడుంటారు..? వాళ్లు కూడా ఈ రాష్ట్రంలో లేరు. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని వచ్చి జగన్ గారిని విమర్శించి వెళ్లడం తప్ప ఈ రాష్ట్రంతో నీకేంటి సంబంధం..? అసలు ఎక్కడ పోటీ చేస్తావో కూడా తెలియదు. ప్యాకేజీ తీసుకుంటావ్..వస్తావు..దూషిస్తావ్..వెళ్తూ దుర్మార్గపు రాజకీయం చేస్తున్నావు. ఈ రాష్ట్రంలోని నీ సామాజిక వర్గాన్ని మాత్రం చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నావు. చంద్రబాబు గారికి నీ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టి..దాని ద్వారా ప్యాకేజీ తీసుకుని జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబును బలోపేతం చేయాలనే కార్యక్రమంలో నిమగ్నమవ్వడం దురదృష్టకరం అని అన్నారు.