గుంటూరు జిల్లా: రేపల్లె నగరం మండలం చినమట్లపూడి గ్రామంలో ఇండియన్ బ్యాంక్ నూతన శాఖను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఇండియన్ బ్యాంక్ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో నగరం ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, ప్రజా ప్రతినిధులు , బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.