గుంటూరు జిల్లా: రేపల్లె రూరల్ మండలం గాదెవారిపాలెం గ్రామానికి చెందిన వివాహిత రేపల్లె భవాని (26) అదృశ్యమైంది. భర్తతో కలిసి ఏ ఊర్లో నివాసం ఉంటున్న భవాని వారం క్రితం గాదెవారిపాలెం గ్రామానికి వచ్చింది.
ఆదివారం భవాని అదృశ్యం కావడంతో భవాని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసిన చోడాయపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆన్ లైన్ లోన్ వేధింపుల కారణంగానే భవాని అదృశ్యమైనట్లు తెలుస్తోంది.