నిత్యం రాజకీయాలలో బిజీగా కాలం గడిపే శాసనసభ్యులు కోన రఘుపతి కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర తీరంలో కాసేపు సరదా చేశారు. ఎమ్మెల్యే కోన తన సతీమణితో కలిసి సాగర తీరంలో బైక్ పై చక్కర్లు కొట్టారు.
ఎమ్మెల్యే దంపతులు బైక్ పై సరదాగా సూర్యలంక సముద్రతీరం చుట్టూ తిరుగుతూ భక్తులను ఉత్సాహపరిచారు. ఉదయం సముద్రుడికి హారతి ఇచ్చి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.