వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. "నాపై కూడా సీఐడీ కేసులు పెట్టారు.. ఒక్క ఆధారం లేదు. మంత్రులకు చెబుతున్నా.. మీ కౌంట్‌డౌన్ మొదలైంది. ఏ తప్పు చేయలేదు కాబ్టటే మళ్లీ ఇక్కడ నిలబడ్డా. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా." అని లోకేశ్ వ్యాఖ్యానించారు.