ఏపీలో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరిగినట్టు గ్యాంగ్ మెన్ ముందుగా గుర్తించడంతో ప్రమాదం తప్పింది.
దీంతో రామేశ్వరం నుంచి వస్తున్న రైలును అధికారులు నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రైలు 10 నిమిషాలు ఆలస్యంగా పాకాలకు చేరుకుంది. ప్రస్తుతానికి ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు యథావిథిగా కొనసాగుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.