ఐపీఎస్ అధికారులమంటూ ఇద్దరు వ్యక్తులు ముంబైలో ఓ బ్యాంకు ఉద్యోగిని మోసం చేశారు. జాబ్ ఇప్పిస్తామని ఓ ఉద్యోగి స్నేహితుడి నుంచి రూ.35 లక్షలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నకిలీ ఐపీఎస్‌లను అరెస్ట్ చేశారు. గణేశ్ శివాజీ చవాన్, మనోజ్ కుపిందర్ పవార్ అనే ఇద్దరిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో తమకు ఉన్నత ఆఫీసర్లతో లింకులు ఉన్నాయని ఆ నకిలీ ఐపీఎస్‌లు చెప్పినట్లు బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు.