విశాఖలోని పెదగంట్యాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సుమారు 1.22 ఎకరాల త్రిభుజాకార స్థలంలో ఈ కాంప్లెక్స్ నిర్మించేలా ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశారు.
ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.7.57 కోట్ల వ్యయం కానుండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.5.29 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2.28 కోట్లు సమకూర్చనున్నాయి.