ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పల్లకీ మోశారని, మరోసారి ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి ఉషశ్రీ చరణ్ సోమవారం పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలను గుర్తించి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు. 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు, సీఎం జగన్ అగ్రకులంలో పుట్టినా బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టారని కొనియాడారు.