తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే జగన్ ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, ఉషశ్రీచరణ్, ఎంపీలు నందిగామ సురేష్, తలారి రంగయ్య, ఏడీసీసీ ఛైర్పర్సన్ లిఖిత, ఎమ్మెల్యే శంకర్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.