పాకిస్థాన్, చైనా, పపువా న్యూ గినియా దేశాల్లో మంగళవారం భూకంపాలు సంభవించాయి. పపువా న్యూ గినియాలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. మరో వైపు పాక్లో తెల్లవారు జామున 3:38 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చింది.
చైనాలోని జిజాంగ్లో తెల్లవారుజామున 3:45 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.