తిరుమల ఆలయంలోని శేష వాహనం ముందు ప్రధాని మోడీ తీసుకున్న ఫొటోపై రాజకీయం చేయడం దుర్మార్గమని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
తానే ప్రధానిని ఆహ్వానించి టీటీడీ కాఫీ టేబుల్ బుక్, పంచగవ్య ఉత్పత్తులు, డైరీ, క్యాలెండర్, స్వామివారి చిత్ర పటం అందించానని అన్నారు. వీఐపీలు, వీవీఐపీలు రంగనాయకుల మండపంలోని శేష వాహనం ముందు ఫొటోలు తీసుకుంటారని, ఇది కొత్త విషయం కాదని అన్నారు.