మంత్రి వేణుగోపాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోషల్ మీడియా టీమ్ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం బాగానే ఉందని, గత కొన్ని రోజులుగా వరుసగా పార్టీ కార్యక్రమంలో పాల్గొని సరైన నిద్ర లేని కారణంగా గాస్టిక్ ఇబ్బంది వచ్చిందని తెలిపారు.
సాధారణ బాడీ చెక్అప్ నిమిత్తం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలిపారు. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు తెలిపినట్లు వెల్లడించారు.