మంగళవారంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధి ముగియాల్సి ఉంది. కానీ మరో రెండు రోజుల పాటు సంధిని పొడగించారు. ఈ నేపథ్యంలో బందీలు విడుదల అవ్వడం గమనార్హం.
ఈ క్రమంలో తాజాగా మరో 11 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. విడుదలైన బందీలను వారి కుటుంబాలకు కలిసే వరకు ఇజ్రాయెల్ సైన్యం వారి వెంటే ఉండనుంది. బందీల విడుదలను వెల్లడించిన కొద్దిసేపటికే 33 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్ జైలు అధికారులు తెలిపారు.