టీడీపీకి కంచుకోటగా ఉన్న నంద్యాలలో ఈసారి అభ్యర్థిని మార్చుతూ భూమా ఫ్యామిలీకి పార్టీ అధిష్టానం షాకిచ్చింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను నియమించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం తెలిపారు. కాగా గత ఎన్నికల్లో ఇక్కడినుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోయారు. అయితే బ్రహ్మానందరెడ్డికి మరో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.