గుజరాత్‌లో పిడుగులు, అకాల వర్షాలు బీభత్సం సష్టించాయి. గడచిని 24 గంటల్లో పిడుగుపాటుకు గురై 24 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. పిడుగుపాటుతో మరణించిన వారిలో దాహౌద్ జిల్లాలో నలుగురు, బరూచ్‌లో ముగ్గురు, తాపీలో ఇద్దరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని 251 తాలూకాలకు గాను 230 తాలూకాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.
రాష్ట్ర అత్యయిక పరిస్థితుల నిర్వహణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం పిడుగుపాటుకు 70కి పైగా మూగజీవాలు చనిపోయాయి. పిడుగుపాటుకు దాహౌద్ జిల్లాలో అత్యధికంగా నల్గురు చనిపోయారు. బనస్కాంత, భరూచ్‌లలో ముగ్గురేసి చొప్పున, తాపీ జిల్లాలో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ పిడుగులు పడి అయిదుగురు చనిపోయారు. అండమాన్ సమీపంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.