ఉత్తరప్రదేశ్ రైతులు చేతికొచ్చిన పంటను కోసేందుకు కూడా వెనుకాడుతున్నారు. మాథొటాండా పరిధిలో గడిచిన నెలరోజులుగా పులుల సంచారం ఎక్కువైంది. దీంతో పంటకోతల సమయంలో కూలీలపై దాడులు పెరుగుతున్నాయి.
వరి, చెరకు పంటల్లో పెద్ద పులులు మాటేసి ఉంటుండటమే ఇందుకు కారణం. అయితే అటవీశాఖ అధికారులు ఈ పరిస్థితిపై దృష్టి సారించామని, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.