సామాజిక సాదికార బస్సు యాత్రకు భారీగా జనం పోటెత్తుతుండటం టీడీపీ హయాంలో జరిగిన అన్యాయానికి ప్రజలు తీర్చుకుంటున్న ప్రతీకారమని స్పీకర్ తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలకు సమాన హక్కులు, అధికారులు, సంపద పంచి పెట్టాలని బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నప్పటికీ ఇన్నాళ్లూ ఆచరణకు నోచుకేలేదని, జగన్ సీఎం అయిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేయాలని సంకల్పించి సామాజిక సాధికారతను సాధించడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని కొనియాడారు.