విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సోమవారం పరిశీలించారు. ఏపీ చరిత్రలో నూతన శకం నెలకొందని, రూ.420 కోట్లతో విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనాన్ని దేశంలోనే ఓ చారిత్రాత్మక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం భావించారని, అందుకు తగ్గట్టుగానే నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు.