టీడీపీ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మీర్జపేట, నాగెళ్లముడుపు, తర్లుపాడులోని బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిం చారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను బూత్ కమిటీ సభ్యులు వేగవంతం చేయాలని సూచించారు. వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఉడుముల చిన్నపురెడ్డి, నాయకులు పి.గోపినాథ్ చౌదరి, కాళంగి శ్రీనివాసులు, టి.చలమారెడ్డి, గుర్రపుసాల నరసింహులు, పెసల వెంకటేశ్వర్లు, ఈర్ల వెంకటయ్య, కుందురు చిన్నకాశిరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.