టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను కోనసీమజిల్లా ఆక్వా రైతులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని యువనేత హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సీడ్, ఫీడ్, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసిందని యువనేత ఆగ్రహం వ్యక్తం చేశారు.