తూర్పుగోదావరి జిల్లా, ప్రత్తిపాడులో ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం ఉదయం టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు టీడీపీలో చేరారు. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, రౌతులపూడి ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మీ, భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జీ, తూర్పులక్ష్మీపురం సర్పంచ్ వీరంరెడ్డి సత్యనాగభార్గవిలకు టీడీపీ కండువాలు కప్పి లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు. పేరూరు విడిది కేంద్రంలో వైసీపీ ఎంపీపీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.