రైతులు ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయని ఆత్మ పిడి కె అన్నపూర్ణ తెలిపారు. మంగళవారం చీమకుర్తి మండలం కెవి పాలెంలో పలు పంటలను వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. మిరప, కంది, పొగాకు వరి పొలాలను పరిశీలించి ప్రస్తుతం ఆయా పంటలకు ఆశించిన పలు తెగుళ్లను, పురుగులను గమనించి నివారణ చర్యలను సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్సీ ఎఓ వివి శేషమ్మ, ఎఈఓ వెంకటేశ్వర్లు, విఏఏలు, రైతులు పాల్గొన్నారు.