కనిగిరి పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన మాధవరావు మంగళవారం కనిగిరి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాధవరావు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే బుర్ర మాట్లాడుతూ ప్రధానంగా కనిగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.