గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు వద్ద ఓ బంక్ లో మంగళవారం సాగుతున్న మట్కా స్థావరంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మట్కా నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను స్పెషల్ ఎంఫర్స్మెంట్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులకు తీసుకున్న వారి వద్ద నుండి 3, 750 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మట్కా ఆడటం చట్టరీత్యా నేరమని సీఐ అరుణకుమారి అన్నారు.