ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ శాఖ విలీనం రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 11:17 AM

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) నుంచి రాష్ట్ర యువజన సర్వీసుల శాఖను వేరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకిరానుండటంతో శాప్ చీఫ్ కోచ్లు డీఎస్ఈవోలుగా వ్యవహరించనున్నారు.
గత ప్రభుత్వం 2018లో యువజన సర్వీసుశాఖను శాప్ లో విలీనం చేశారు. కాగా ఆ విలీనం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 'ఆడుదాం ఆంధ్రా పోటీలు' నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com