ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాజాగా పబ్లిక్ కుళాయి నీళ్లు తాగాడని కమలేష్(24) అనే దళిత యువకుడిని కొందరు కట్టెలతో కొట్టి చంపారు.
సోమవారం రాత్రి సాత్రా గ్రామంలోని పబ్లిక్ కుళాయిలో నీళ్లు తాగాడని కమలేష్పై సూరజ్ రాథోడ్ అతడి సహచరులు దాడి చేశారు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.