జగన్ నాయకత్వంలో పేదలు తలెత్తుకుని తిరిగేలా అవకాశాలు కల్పించారని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అయన మాట్లాడుతూ.... ఈ ప్రాంతానికి సాగునీరు, తాగు నీరు తెచ్చింది అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ మాత్రమేనని, గత టీడీపీ ప్రభుత్వంలో అశోక్ గజపతి వంటి నేతలు కేంద్ర మంత్రిగా పని చేసినా సరే ఎటువంటి అభివృద్ధి పని చేయలేదన్నారు. ప్రపంచ పటంలో భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా ఉత్తరాంధ్రను జగన్ నిలిపారని, అలాగే ఇండిస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో పుట్టి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వంటి నేతలకు ప్రజాకోర్టులో ఓటమి తప్పదని హెచ్చరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మళ్లీ 9 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ స్థానాలు తిరుగులేని మెజార్టీతో గెలుచుకుంటామని మజ్జి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేసారు.