ఉత్తరాంధ్రలో సామాజిక సాధికార యాత్ర సంబరంలా సాగుతోందని, అన్ని సామాజిక వర్గాల నాయకులు, ప్రజలు కలసి వేడుకగా జరుపుతున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వివరించారు. తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచిన చంద్రబాబును వెనక్కి పంపాలని, అందుకు వచ్చే ఎన్నికల్లో చేయి చేయి కలిపి సమిష్టిగా పని చేసి నెట్టి వేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. బాబుపై చర్యలు తీసుకునే అవకాశం ప్రజలకు వస్తుందని, ఎన్నికల్లో ప్యాన్ బటన్ నొక్కి చంద్రబాబును పంపేయాలని కోరారు. రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసి 45 వేల స్కూల్స్ ని నాడు - నేడు ద్వారా జగన్ అబివృద్ధి చేసారని మంత్రి అప్పలరాజు వివరించారు. పేదలు ఎవరి వద్దా తలదించాల్సిన, బ్రతిమాలాడాల్సిన, చేయి చాచాల్సిన అవసరం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న మనుసున్న ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని, ఇదే రాష్ట్రానికి నిజమైన సాధికారత అని వెల్లడించారు. ప్రజలు బాగోగులు చూసుకుంటున్న జగన్ కు భయమంటే ఏంటో పాదయాత్రచేస్తున్న లోకేశ్ చూపిస్తానంటున్నాడని, తన మామయ్య బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పులు జరిగినపుడు ఆసుపత్రిలో జాయిన్ అయి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఘటనను తెలుసుకోవాలని, తెలంగాణలో ఓటుకు నోటు కేసులో భయపడి రాత్రికి రాత్రే విజయవాడ వచ్చిన ఘటనలోనూ, స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి కళ్లు కనిపించడం లేదని బెయిల్ తెచ్చుకున్న తన తండ్రిని అడిగితే భయమంటే ఏమిటో చెబుతారని సీదిరి ఎద్దేవా చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారంలో తెలుగుదేశం కార్యకర్తలు తిరుగుతుంటారని, చంద్రబాబు బీజేపీతో పొత్తుకు పాకులాడుతూ నీచ రాజకీయాలను చేస్తుంటే, జగన్ మాత్రం ఏ పార్టీతో పొత్తులు లేకుండా సింగిల్ గా వస్తున్నారని, మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం జగనే రావాలి..జగనే కావాలి అంటూ సభికులతో మంత్రి నినాదాలు చేయించారు.