గత పరిపాలనకు, ఇప్పటి పరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని, చంద్రబాబు చేసిన అన్యాయాలు, జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలతో మారిన జీవనం మధ్య తేడాలని కూడా ఆలోచించాలని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర కోరారు. చంద్రబాబు పాలనలో గిరిజనులకు, ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వకుండా విస్మరించారని, జగన్ సీఎం అయిన తర్వాత ఈ రెెండు వర్గాలకు మంత్రి పదవులు కేటాయించి గుర్తింపునిచ్చారన్నారు. రూ. 87,618 కోట్ల రైతుల రుణాల మాఫి చేయాల్సి ఉండగా, కేవలం 15 వేల కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసి చంద్రబాబు చేయి దులుపుకున్నారని, రూ. 12 వేల కోట్లు డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని మహిళలకు హామీ ఇచ్చి వారిని మోసం చేసారని, మహిళలను, రైతులను మోసం చేసిన ఈ తెలుగుదేశం పార్టీని ఆ వర్గాలు ఎలా నమ్ముతాయని ప్రశ్నించారు. జగన్ ఎన్నికలకు ముందు చెప్పినవే కాకుండా, చెప్పనవి కూడా చేసి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. పొత్తులతో మోసగాళ్లు వస్తున్నారని, చంద్రబాబు హామీ ఇచ్చి చేసిన మోసాలను గుర్తు చేసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలన్నది గుర్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర వేదికపై పాట పాడి సభికులను ఉత్సాహ పరిచారు.