స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా సరే అత్యంత వెనుకబాటుకు ఉత్తరాంధ్ర గురైందని, ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతాన్ని అబివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. రూ. 4,700 కోట్లతో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు చేపడుతున్నారని, తెలంగాణలో ఎయిర్ పోర్టు కలిగిన శంషాబాద్ తరహాలోనే భోగాపురం ప్రాంతం కూడా అబివృద్ధి చెంది 50 వేల మంది వరకు ఉపాది లభించనుందన్నారు. సారిపల్లి ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారని వివరించారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సరికొత్త మార్పులు తీసుకువచ్చిన జగన్ సుపరి పాలన సాగిస్తున్నారని వెల్లడించారు.