వైసీపీ పార్టీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.... జగనన్న పరిపాలనలో సామాజిక సాధికారత సాధించాం. అంబేద్కర్, జ్యోతిరావు పూలే కన్న కలలను సాకారం చేసిన ఏకైక సీఎం జగనన్న. మనం పథకాలు కావాలని అడగలేదు, అమ్మ ఒడి అడగలేదు. సున్నా వడ్డీ, చేయూత, ఆసరా అడగలేదు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా జగనన్న నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో ఇంటికి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా ఆర్థిక సాయం అందింది. అందుకే తలసరి ఆదాయం గతంకంటే మెరుగైంది. ఓటు బ్యాంకుకే పరిమితమైన వర్గాలకు ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పదవుల్లో అత్యున్నత స్థానం కల్పించిన సీఎం జగన్. రాజ్యసభ స్థానాలకు అమ్ముకొనే సంస్కృతికి భిన్నంగా అణగారిన వర్గాలకు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సముచిత స్థానం కల్పించిన జగనన్న. ఇక్కడ పోస్టల్ అడ్రస్ కూడా లేని వారు రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నారు. టీడీపీ అంపశయ్యపై ఉంది. దాన్ని బతికించాలని పవన్ తహతహలాడుతున్నాడు. పదవులు వద్దని, చంద్రబాబును సీఎం చేయాలని పరితపించే రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి పవన్ అని ఆరోపించారు.