ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కొత్త పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రూ.402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్‌లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఏర్పాటు చేసిన సిగాచి ఇండస్ట్రీస్ గ్రీన్ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో–ఇథనాల్ తయారీ యూనిట్‌లను ప్రారంభించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ఏర్పాటు చేయనున్న 17 ప్రాజెక్టుల్లో గుంటూరు, హిందూపూర్, మచిలీపట్నంలో రూ.670 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో స్టార్చ్ ప్రాసెసింగ్ యూనిట్, విజయనగరం, కర్నూలులో ఏర్పాటు చేసే ఆర్టీఈ/ఆర్టీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు.