స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈకేసుపై బుధవారం హైకోర్టులో విచారణకు రాగా.. కొంత మందికి మాత్రమే నోటీసులు అందాయని మరి కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని మిగతా వారి అడ్రస్‌లు తప్పుగా ఉండటంతో అవి చేరలేదని కోర్టుకు రిజిస్ట్రార్ తెలిపారు. వీరికి పర్సనల్ నోటీసులు ఇవ్వటానికి పిటిషనర్ అనుమతి కోరారు. దీంతో కొత్త అడ్రసులతో మళ్లీ ఫ్రెష్ నోటీసులు ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇస్తూ.. తదుపరి విచారణను డిసెంబర్ 30కు వాయిదా వేసింది.