ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో డ్రగ్స్‌కు బానిసైన ఓ తండ్రి తన కుమార్తెను కొట్టి చంపాడు. సీతాపూర్‌కు చెందిన మమత, దర్నాగ్‌కు చెందిన సౌరభ్ గౌతమ్‌లకు ఏడాది క్రితం వివాహమైంది. సౌరభ్ విధులు ముగించుకుని తాగి ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం పెరిగి గొడవకు దారితీసింది. మంచంపై నిద్రిస్తున్న మూడు నెలల కుమార్తెను కొట్టాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa