రాష్ట్రంలోని అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీ కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త పోలంరెడ్డి దినేష్రెడ్డి కోరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...... వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. నియోజకవర్గ పరిధిలోని రోడ్లన్ని గుంతలతో నిండిపోయాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు సీఎంగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని కోరారు.