ఒడిశా అడవుల్లో నల్ల చిరుతపులి కనిపించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుశాంత నంధో సోషల్ మీడియా 'ఎక్స్'లో వివరాలను వెల్లడించారు. పులుల లెక్కింపునకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు ఈ చిరుత చిక్కిందని చెబుతున్నారు. ఏ అడవిలో కనిపించిందో చెప్పలేదు. ఈ బ్లాక్ పాంథర్ చిరుతపులి కనిపించడం ఇదే మొదటిసారి కాదని, 2018లో సుందర్‌ఘర్ జిల్లా అడవుల్లో ఒకసారి కనిపించిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa