చండీగఢ్‌లో ఓ యువతి తన ప్రియుడి కోరిక మేరకు ఓ లేడీస్ హాస్టల్లోని టాయిలెట్లో వెబ్‌క్యామ్‌ను అమర్చింది. పీజీలో ఉన్న అమ్మాయిల వీడియోలను ఎవరూ గమనించకుండా రహస్య కెమెరాతో చిత్రీకరించారు. తాజాగా ఓ అమ్మాయి కెమెరాను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కెమెరా, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.