ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనిచేసే ఉద్యోగులు రోజుకు 3 షిఫ్టులు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి సూచించారు. ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. బుధవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే పద్ధతికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉద్యోగులు వదిలేయాలని ఆయన కోరారు. అభివృద్ధిలో చైనాను మించాలంటే 3 షిఫ్టుల విధానం తప్పనిసరి అన్నారు.