చిలకలూరిపేట శాలివాహన, కుమ్మర ప్రజాపతి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీ పట్టణంలోని విజ్ఞాన విహార్ పాఠశాలలో కార్తీక వన సమారాధన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నిడమానురు హనుమంతరావు తెలిపారు.
శుక్రవారం నరసరావుపేట కార్యాలయంలో సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక వన మహోత్సవం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.