చిలకలూరిపేట పట్టణంలోని పాలనా యంత్రాంగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను గాలికొదిలేస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా మలుచుకుంటూ అవినీతి అందలం ఎక్కేందుకు అత్యంత ఉత్సాహం చూపెడుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల పనులను చక్కబెట్టేందుకు లంచాలకు అలవాటు పడి అవినీతిలో మునిగిపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం పట్టణ ప్రజలు కోరుతున్నారు.