తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ సలహాదారు (విద్యాశాఖ) ఆలూరు సాంబశివారెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.