ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను నార్త్ జోన్ ఎసిపి జాన్ మనోహర్ హెచ్చరించారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశాలతో నార్త్ ఏసిపి తగిన చర్యలు చేపట్టారు.
గురువారం, శుక్రవారాల్లో ఎండాడ జంక్షన్లో పీఎం పాలెం, ఆరిలోవ పోలీసులు, సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.