బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం రానున్న 48 గంటాల్లో తుఫాన్ గా మారనుందని విశాఖలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.
ఉత్త్రర తమిళనాడు, దక్షిణాంధ్ర సమీపంలోకి వొచ్చి తర్వాత ఉత్తర దిశగా ప్రయాణించి నెల్లూరు - కోనసీమ మధ్యలో లేదా ఉత్తరాంధ్ర సమీపంలో 4- 5వ తేదీన తీరం తాకే అవకాశం ఉంది. కానీ దీని ప్రభావం 3వ తేదీ నుంచి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.