అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ భీమవరం జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి అన్నారు. డిసెంబరు 8 తేదీ నుంచి అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతును కోరుతూ పట్టణ సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు అతి తక్కువ గౌరవ వేతనాలతో వెట్టి చాకిరి చేస్తున్నారని పెరిగిపోతున్న ధరలతో చాలీచాలని జీతాలతో జీవితాలు గడపడం చాలా కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వా డీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. సమస్యల పరి ష్కారం కోసం 8 నుంచి నిరవధిక సమ్మె చేపట్టామని తెలియజేశారు. శిరీష్ కుమార్, జక్కం శెట్టి సత్యనారాయణ, వెంకటేశ్వరావు, క్రాంతిబాబు, సరోజిని, వరలక్ష్మి, మునియ్య తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి రాజా రామ్మోహన్‌రాయ్, జిల్లా ఉపాధ్యక్షుడు వాసుదేవరావు మాట్లా డుతూ అంగన్వాడీల పోరాటానికి సీఐటీయూ అండగా నిలబడుతుందన్నారు.