ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే ను ఎస్పీ మల్లికా గార్గ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ గ్రీవెన్స్ డేకు హాజరైన సిబ్బంది యొక్క సమస్యలను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఎస్పీ తెలిపారు. అలాగే పోలీస్ సిబ్బంది యొక్క సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.