గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామంలోని కాశీరావు కుమారుడు జనార్ధన్ (7) శుక్రవారం చెరువులో పడి మృతి చెందాడు. ఆ బాలుడు తోటి పిల్లలతో కలిసి మముడూరు రిజర్వాయర్ సమీపంలోని కుంటవద్దకు వెళుతుండగా అక్కడ పాఠశాల ఉపాధ్యాయిని వారిని మందలించి పంపింది. ఐతే పాఠశాల వదిలిన తర్వాత జనార్ధన్ చేపలు చూసేందుకు చెరువు వద్దకు వెళ్ళి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.