బూత్ లెవెల్ అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ మాట్లాడుతూ బిఎల్వోలు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తప్పనిసరిగా శని, ఆదివారాలలో హాజరై దరఖాస్తులను స్వీకరించాలన్నారు. జిల్లాలో అనాలసిస్ వెరిఫికేషన్ మరో 500 గృహాలు 1, 387 ఓట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు.